మల్టీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్ విధానాన్ని రద్దు చేయాలి : పౌర సంక్షేమ సమితి

మల్టీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్ విధానాన్ని రద్దు చేయాలి : పౌర సంక్షేమ సమితి

సిరిసిల్ల టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న మల్టీపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటర్ విధానాన్ని రద్దు చేయాలని సెస్ ఆఫీస్ ఎదుట జిల్లా పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సమితి సభ్యుడు బియ్యంకర్ శ్రీను  మాట్లాడుతూ... ఒక పొయ్యి ఒకే మీటరు విధానంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విధానం ద్వారా ఒకే వంట గదితో రెండు మీటర్లతో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయన్నారు.