ఖాళీ ప్లేట్లతో కాలేజ్  స్టూడెంట్ల ఆందోళన : వరంగల్ జిల్లా

నర్సంపేట, వెలుగు : మిడ్​డే మీల్స్ పెట్టాలని డిమాండ్​చేస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట గవర్నమెంట్​ జూనియర్ కాలేజీ స్టూడెంట్లు ఖాళీ ప్లేట్లతో మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ బొట్ల నరేశ్​మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మిడ్​డే మీల్స్​ఏర్పాటు చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చే స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయకపోవడం వల్ల పస్తులు ఉండే పరిస్థితి నెలకొందన్నారు. నిరసనలో ప్రశాంత్, వినయ్​కుమార్, రామకృష్ణ, ప్రసాద్, రమ్య, రవళి, కావ్య ఉన్నారు.