ఆదుకోవాలని మున్నేరు వరద బాధితుల ధర్నా

ఆదుకోవాలని మున్నేరు వరద బాధితుల ధర్నా

ఖమ్మం, వెలుగు : మున్నేరు వరద కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు ఆందోళనకు దిగారు. కరుణగిరి, ఫోర్త్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ కాలనీ, సాయికృష్ణానగర్‌‌‌‌కు చెందిన పలువురు సోమవారం ఉదయం కరుణగిరి దగ్గర బైపాస్‌‌‌‌ రోడ్డుపై బైఠాయించారు. వర్షం, వరద కారణంగా ఇబ్బంది పడుతున్న తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

మున్నేరుకు వరద వచ్చిన ప్రతీసారి ఇబ్బంది పడుతున్నామన్నారు. తమకు డబుల్‌‌‌‌ ఇండ్లు కేటాయించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ క్రమంలో ఓ కారును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బాధితుల మధ్య వాగ్వాదం జరిగింది. ధర్నా కారణంగా ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే టైంలో కలెక్టర్‌‌‌‌ ముజమ్మీల్‌‌‌‌ ఖాన్‌‌‌‌, సీపీ సునీల్‌‌‌‌ దత్‌‌‌‌ అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.