తంగళ్లపల్లి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల జీవితాలతో ఆడుకోవద్దని సీఐటీయూ తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ అన్నారు. నేతన్నలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లిలో కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమను కాపాడాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
బతుకమ్మ చీరల ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు కుడిక్యాల కనకయ్య, అన్నల్దాస్ గంగాధర్, నర్సయ్య, రాజమల్లు, వేణు , ఎల్లయ్య , అంబదాస్ , రమేశ్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.