మహబూబాబాద్​ జిల్లాలో వక్ఫ్​బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

మహబూబాబాద్​ జిల్లాలో వక్ఫ్​బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

మబూబాబాద్, వెలుగు: హముస్లింల హక్కులను కేంద్రం హరించడం తగదని ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రునాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్​​ అన్నారు. సోమవారం మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో వక్ఫ్​బిల్లుకు వ్యతిరేకంగా, బోర్డు పరిరక్షణ కోసం వివిధ పార్టీల నేతలు, సంఘాల నాయకులు నల్ల జెండాలు, జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫొటోలతో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకొని వచ్చిన నూతన వక్ఫ్ బిల్లును రద్దు చేసేంతవరకు  పోరాటాలను కొనసాగించాలన్నారు. ర్యాలీలో బీఆర్​ఎస్​ నేతలు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, సీపీఐ, సీపీఎం నాయకులు అజయ్ సారధి, సూర్నపు సోమయ్య, వివిధ సంఘాల నాయకులు, జిల్లా వక్ఫ్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ మహమ్మద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.