మా భూమి మాకివ్వండి .. కుదబక్షపల్లి రైతులు డిమాండ్

మర్రిగూడ ( చండూరు) వెలుగు:  శివన్నగూడ ప్రాజెక్టులో అదనంగా తీసుకున్న 57 ఎకరాల 37 గుంటల భూమిని తిరిగి ఇవ్వాలని మర్రిగూడ మండలం కుదబక్షపల్లి నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు.  బుధవారం గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అదనంగా సేకరించిన భూమి ప్రాజెక్టు పరిధిలోకి రాదని కలెక్టర్ చెప్పినా..  తమ భూమి తమకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ALS0 READ: ధరణితోనే అన్ని సమస్యలు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల కోసమే 250 మీటర్లు ఉన్న ప్రాజెక్టు కట్టను 600 మీటర్లకు పెంచారని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో నిర్వాసితులు తాళ్లపల్లి మారయ్య, మెగావత్ గణేశ్, బ్రహ్మచారి, మాధగొని సైదులు, బలరాం, లక్ష్మయ్య, జానయ్య, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.