మంజూరైన పెన్షన్​ రావడం లేదని నిరసన

జగిత్యాల టౌన్, వెలుగు : ప్రజావాణి సమస్యలకు సత్వరం పరిష్కారం చూపాలని జగిత్యాల అడిషనల్ కలెక్టర్​దివాకర సూచించారు. సోమవారం ​కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చిన 21 దరఖాస్తులు వచ్చాయి. 

తనకు పెన్షన్​మంజూరైన రావడం లేదని కోరుట్ల మండలం నాగులపేటకు చెందిన కల్లుగీత కార్మికుడు బత్తిని సత్తయ్య అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు.