మిరుదొడ్డి మండలంలో బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ

మిరుదొడ్డి మండలంలో బీఆర్ఎస్ నేతలకు నిరసన సెగ

దుబ్బాక  నియోజకవర్గం మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన  బిఆర్ఎస్ నేతలకు  చేదు అనుభవం ఎదురైంది.   కాసులాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ ప్రచారం లో పాల్గొన్న ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ పాల్గొన్నారు. కొత్తా ప్రభాకరరెడ్డిని ఎంపీగా గెలిపించినా..  కాసులాబాద్ గ్రామ అభివృద్ధిని  ఎందుకు నిర్లక్ష్యం చేశారని  బీఆర్ఎస్ పార్టీ వారిని గ్రామ ప్రజలు ప్రశ్నించారు. దీంతో ఏం చేయాలో తెలియక గ్రామస్థులపై బీఆర్ఎస్ నాయకులు దాడికి దిగారు.    గత పక్షం రోజులగా వివిధ గ్రామాల్లో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలను  నిలదీస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రచారాన్ని సైతం అడ్డుకోవడంతో షాక్ కు గురవుతున్నారు.