కవ్వాల్ టైగర్ జోన్‌లో అటవీ ఆంక్షలు ఎత్తి వేయాలని ఆందోళన 

కవ్వాల్ టైగర్ జోన్‌లో అటవీ ఆంక్షలు ఎత్తి వేయాలని ఆందోళన 

జన్నారం, వెలుగు :  కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని ఫారెస్ట్ చెక్ పోస్టుల వద్ద అటవీ ఆంక్షలను ఎత్తివేయాలని అఖిల పక్షం, లారీ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. రేండ్లగూడ సమీపంలోని ఆర్ఆర్ఎస్ మినీ ఫంక్షన్ హాల్​లో ఫారెస్ట్ ఆఫీసర్లు ఎన్జీవో లతో సమావేశం  నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని అఖిల పక్షం నాయకులు అక్కడికి చేరుకుని పెద్ద  ఎత్తున నినాదాలు చేశారు. ఎస్ఐ రాజవర్ధన్ ఘటనా స్థలానికి చేరుకొని అఖిలపక్ష నాయకులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.

అనంతరం డీఎఫ్ వో శివ్, ఎఫ్​డీపీటీ శాంతారామ్ లు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ సందర్భంగా వారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్  నాయకులు ఎం.రాజశేఖర్,  సోహేల్ షా, రియాజొద్దీన్, ముత్యం సతీశ్​, స్వచ్ఛంద సంస్థ సభ్యుడు భూమాచారి, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండీ బాబా, ఇక్రాం,  ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.