రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని నిరసన

నేరేడుచర్ల, వెలుగు: రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డీలర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక తహసీల్దార్ ఆఫీస్​ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు డీలర్లు మాట్లాడుతూ చాలీచాలని కమీషన్లతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ ల సంఘం అధ్యక్షుడు కరుణం పాండయ్య, ఉపాధ్యక్షుడు షేక్ అబ్బాస్,చింతమళ్ల సైదులు,గెల్లి లక్ష్మీనారాయణ, బుడిగె వెంకటేశ్వర్లు గౌడ్, సోమిరెడ్డి,ఎల్లయ్య పాల్గొన్నారు.