బెల్లంపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నిరసన

మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్​ డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం ఢిల్లీకి చేరింది. లైంగిక వేధింపులకు పాల్పడిన చిన్నయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్​ఆదివారం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఆందోళన చేశారు.

ఎమ్మెల్యే చిన్నయ్య శేజల్​ను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని, తమ దగ్గర రూ.30 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫ్లెక్సీ ప్రదర్శించారు. సోమవారం మానవ హక్కుల కమిషన్​, విమెన్​ కమిషన్​లో ఫిర్యాదు చేసి జంతర్​మంతర్​దగ్గర దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.