- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన
ఎల్బీనగర్, వెలుగు : విశ్వకర్మ వృత్తులను కులాలుగా విభజించవద్దని, ఒకే కులంగా కొనసాగించాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నాయకులు డిమాండ్చేశారు. బుధవారం ఎల్బీనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతచారి విగ్రహాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వకర్మ వృత్తులను పంచకులాలుగా విభజించవద్దని, ఒకే కులంగా పరిగణించాలని డిమాండ్ చేశారు.
విభజిస్తే విశ్వబ్రాహ్మణ కులానికి తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అందోజు శ్రీనివాసచారి, ఎన్.సల్వాచారి, నాగోజు రామాచారి, నారోజు జగ్జీవన్, పులిగిల్ల శ్రీనివాసచారి, బ్రహ్మచారి, అందోజు దయానంద్ చారి తదితరులు పాల్గొన్నారు.