ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన, జిల్లా కార్యదర్శి దేవర మల్లీశ్వరి అన్నారు. మహిళా సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు కల్పించాలని ఉద్యమిస్తున్న రాజాపై కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.

కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు సోమగాని లక్ష్మమ్మ, పాలకూరి యశోధ, లక్ష్మి, పాలకూరి మమత, పాపమ్మ, షేక్ ఫాతిమా, షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జానీబా తదితరులు పాల్గొన్నారు.

పోటెత్తిన ఓటర్లు

వెలుగు, నెట్‌వర్క్‌: మునుగోడు ఉపఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం కాస్త స్లోగా నడిచిన పోలింగ్‌ మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్‌ సెంటర్లకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక వెహికల్స్‌ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. 6 గంటల లోపు సెంటర్ల వద్దకు వచ్చిన వారందరికీ ఆఫీసర్లు స్లిప్పులు అందజేసి ఓటు వేసే అవకాశం కల్పించడంతో రాత్రి పొద్దు పోయే వరకు పోలింగ్‌ సాగింది. నియోజకవర్గ వర్గ వ్యాప్తంగా మొత్తం 90 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. 

పోలింగ్‌‌‌‌‌‌‌‌ సరళిని పరిశీలించిన బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు

యాదాద్రి, వెలుగు : మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్‌‌‌‌‌‌‌‌ నారాయణపురం మండలాల్లోని పోలింగ్‌‌‌‌‌‌‌‌ సరళిని బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు గురువారం పరిశీలించారు. చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మున్పిసాలిటీ, నారాయణపురం మండల కేంద్రాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌ రావు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, టీపీసీసీ మెంబర్, ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య వేర్వేరుగా పర్యటించారు. బూత్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జులతో మాట్లాడి పోలింగ్‌‌‌‌‌‌‌‌ సరళిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు.

దేవరకొండ డిగ్రీ కాలేజీని తనిఖీ చేసిన న్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం

దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండలోని మునగాల కొండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు  డిగ్రీ కాలేజీని గురువారం న్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం పరిశీలించింది. నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రిడిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రజనీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్​ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశాజ్యోతి కలకనూరి, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రుబా సైకియా కాలేజీలోని క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టూడెంట్లకు అందుతున్న సౌకర్యాలను, రికార్డులను పరిశీలించారు.

పరిశుభ్రత, క్రీడలు, పచ్చదనం, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ కేడెట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కాలేజీకి వస్తున్న ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాటి ఖర్చుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామరాజు, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శారదాదేవి, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాఘవేంద్ర, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గీత పాల్గొన్నారు.

బీజేపీ లీడర్లపై దాడులు సరికాదు

రాజాపేట, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌, బీజేపీ నాయకులపై దాడులను నిరసిస్తూ గురువారం యాదాద్రి జిల్లా రాజాపేటలో బీజేపీ లీడర్లు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ మునుగోడులో ఓడిపోతామన్న భయంతోనే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు డబ్బు, మద్యం పంచుతున్నా పట్టించుకోని పోలీసులు ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను మాత్రం అక్రమంగా అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు పంపిణీ, అక్రమ అరెస్ట్‌‌‌‌‌‌‌‌లు, దాడులతో బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, మండల అధ్యక్షుడు బాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాయకులు రాజు, సిద్దేశ్వర్, వినోద్, లక్ష్మణ్, సంపత్ పాల్గొన్నారు.

స్టూడెంట్లను సైంటిస్టులుగా తీర్చిదిద్దాలి

సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సూర్యాపేట, వెలుగు : స్టూడెంట్లలో వైజ్ఞానిక స్పృ-హ పెంచేందుకు చెకుముకి పోటీలు ఎంతో ఉపయోగపడుతాయని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. డీఈవో అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెకుముకి పోటీల పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లను సైంటిస్టులుగా మార్చేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేయాలని సూచించారు.

ఈ పోటీల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి స్టూడెంట్లు పాల్గొంటారన్నారు. స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయిలో ఈ నెల 18, మండల స్థాయిలో 22, జిల్లాస్థాయిలో 27 తేదీల్లో పోటీలు జరగుతాయని, అలాగే డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9, 10, 11 తేదీల్లో సిరిసిల్లలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు జి.రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సభ్యులు నారాయణరెడ్డి, డి. జనార్దన్, కె. శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆంజనేయులు, ఈ.సైదులు పాల్గొన్నారు.

అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల్లో మెరుగైన సేవలు అందించాలి

అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రం ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూట్రిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టం మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజరీ సప్లిమెంటరీ ఫీడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రాంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రంలో సేవలు, పనులు, నెలవారీ రిపోర్టుల కోసం యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందించినట్లు చెప్పారు. ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లపై పని భారం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీడీ జ్యోతి పద్మ, ఐటీ కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవికుమార్, పోషణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంపత్ పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

కోదాడ, వెలుగు : పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. కోదాడ మండలం అడ్లూరులో గురువారం నిర్వహించిన పశువుల గర్భకోశ వ్యాధుల నివారణ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పశు సంవర్ధక శాఖ ఆఫీసర్లు ఇస్తున్న సలహాలు, సూచనలను పాటించి పశు సంపదను పెంచుకోవాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పశు సంపద ఎంతో కీలకం అన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాసరావు, మండల పశు వైద్యాధికారి నాగేంద్రబాబు, సురేందర్, వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పశు వైద్య సిబ్బంది ఖాన్, సాయికృష్ణ, గోపాలమిత్రలు నాంచారయ్య, శ్రీను, ప్రసాద్, ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెట్టి లచ్చిరెడ్డి పాల్గొన్నారు. 

దేవరకొండ డిగ్రీ కాలేజీని తనిఖీ చేసిన న్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం

దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండలోని మునగాల కొండల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు  డిగ్రీ కాలేజీని గురువారం న్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం పరిశీలించింది. నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రిడిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రజనీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్​ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశాజ్యోతి కలకనూరి, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్రుబా సైకియా కాలేజీలోని క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టూడెంట్లకు అందుతున్న సౌకర్యాలను, రికార్డులను పరిశీలించారు. పరిశుభ్రత, క్రీడలు, పచ్చదనం, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ కేడెట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కాలేజీకి వస్తున్న ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాటి ఖర్చుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామరాజు, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శారదాదేవి, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాఘవేంద్ర, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గీత పాల్గొన్నారు.

‘చలో ఢిల్లీ’ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి

రాజాపేట, వెలుగు : విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ మహాధర్నాకు కార్మికులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరుకావాలని టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు అయిలయ్య పిలుపునిచ్చారు. రాజాపేట సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  గురువారం ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో తక్కువ మందితో పనిచేయిస్తూ శ్రమదోపిడీ చేస్తోందని ఆరోపించారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరిచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు నగేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాలరాజు పాల్గొన్నారు.