శాయంపేట, వెలుగు : గత 15 రోజులుగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గారమంలో తాగు నీరు రావడం లేదని, పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో ఆఫీసు ముందు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఎస్ఎఫ్ఎఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలోని దళిత కాలనీలో గత 15 రోజులుగా తాగునీరు రావడంలేదని
కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి తాగునీరు సరఫరా చేయాలని లేకుంటే.. కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ జిల్లా నాయకులు కళ్యాణ్, ఇస్మాయిల్, ఈశ్వర్, గణేశ్, రాజ్‌కుమార్, శశాంక్, నవీన్, రాజ్, సందీప్ పాల్గొన్నారు.