ఆదిలాబాద్టౌన్, వెలుగు; ప్రభుత్వం సమగ్ర శిక్ష కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆదివారం జిల్లా కేంద్రంలో బోనాలను ఎత్తుకొని నిరసన తెలిపారు. కలెక్టరేట్ దీక్ష శిబిరం నుంచి బోనాలతో ర్యాలీగా డైట్ మైదానంలోని పోచమ్మ గుడి వరకు వచ్చారు.
డప్పులతో నృత్యాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరారు. తమకు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.