గంభీరావుపేట్, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కేంద్రంలో డబుల్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ పలువురు అర్జీదారులు గురువారం తహసీల్ఆఫీస్ఎదుట ధర్నాకు దిగారు. అర్హత ఉన్నవారికి ఇండ్లు ఇవ్వలేదని నిరసన తెలిపారు.
ALSO READ : భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కట్టుబడి ఉన్నాం : జస్టిన్ ట్రూడో
మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హులకు ఇండ్లు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. అనంతరం తహసీల్దార్భూపతి మాట్లాడుతూ అర్జీదారుల పేర్లు పరిశీలించి అర్హులకు ఇండ్లు ఇస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.