కాజీపేట, వెలుగు : మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు ఇస్తానని చెప్పి వీధివీధికి లిక్కర్‌షాపు తెరిచిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విమర్శించారు. కాజీపేట ప్రాంతంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ విష్ణుపురి వాటర్ ట్యాంక్ వద్ద ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా రావు పద్మ మాట్లాడుతూ ప్యాకేజీలకు పరిమితమైన పాలకులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదన్నారు.
ALSO READ: తెలంగాణలో మాత్రమే అనేక పథకాలున్నయ్: ఎర్రబెల్లి దయాకర్‌రావు
కాజీపేట ఏరియాలో 15 రోజులుగా మంచినీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నెల 9న మంత్రి కేటిఆర్ పర్యటన కోసం రోడ్లను శుభ్రం చేసి, డివైడర్లకు రంగులు వేస్తున్న ఆఫీసర్లు తాగునీటి లైన్ల రిపేర్లను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే ప్రజలే ఖాళీ బిందెలతో కేటీఆర్‌కు స్వాగతం పలుకుతారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిర్ర నర్సింగ్‌గౌడ్, గుంటి కుమారస్వామి, ఎండీ.చాంద్‌పాషా, ఆకుల శ్రీకాంత్ పాల్గొన్నారు.