లగచర్ల దాడిని నిర‌‌‌‌‌‌‌‌సిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు ధ‌ర్నాలు

లగచర్ల దాడిని నిర‌‌‌‌‌‌‌‌సిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు ధ‌ర్నాలు
  • అన్ని కలెక్టరేట్ల ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన  
  • తెలంగాణ ఉద్యోగుల జేఏసీ 
  • చైర్మన్ ల‌చ్చిరెడ్డి పిలుపు
  • తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ల‌‌‌‌చ్చిరెడ్డి పిలుపు

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారుల‌‌‌‌పై జరిగిన దాడిని ఉద్యోగులే కాకుండా రాజ‌‌‌‌కీయాల‌‌‌‌కు అతీతంగా అంద‌‌‌‌రూ ఖండించాల‌‌‌‌ని తెలంగాణ  ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌‌‌‌చ్చిరెడ్డి కోరారు. ఈ దాడిని నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క‌‌‌‌లెక్టరేట్ల ముందు భోజ‌‌‌‌న విరామ స‌‌‌‌మ‌‌‌‌యంలో న‌‌‌‌ల్లబ్యాడ్జీలు ధ‌‌‌‌రించి నిర‌‌‌‌స‌‌‌‌నలు, ధ‌‌‌‌ర్నాలు చేప‌‌‌‌ట్టాల‌‌‌‌ని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హైద‌‌‌‌రాబాద్ క‌‌‌‌లెక్టరేట్ వ‌‌‌‌ద్ద మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా చేయనున్నట్టు తెలిపారు. ఇందులో జేఏసీ రాష్ట్ర నాయ‌‌‌‌క‌‌‌‌త్వం పాల్గొనాల‌‌‌‌ని కోరారు. అధికారం లేదనో, అధికారం కోస‌‌‌‌మో ఉద్యోగుల‌‌‌‌పై దాడికి ప్రేరేపించ‌‌‌‌డం సరైన చ‌‌‌‌ర్య కాద‌‌‌‌న్నారు. 

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లో జరిగిన‌‌‌‌ జేఏసీ అత్యవ‌‌‌‌స‌‌‌‌ర స‌‌‌‌మావేశంలో తీసుకున్న ప‌‌‌‌లు నిర్ణయాలపై లచ్చిరెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జ‌‌‌‌రిగే ధ‌‌‌‌ర్నాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగులు, జేఏసీ నాయ‌‌‌‌కులు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్​చేయాల‌‌‌‌ని పిలుపునిచ్చారు. ‘‘ప్రజ‌‌‌‌ల‌‌‌‌కు, అన్ని పార్టీల‌‌‌‌కు ఉద్యోగులంద‌‌‌‌రూ స‌‌‌‌మాన‌‌‌‌మే. కానీ అధికారుల‌‌‌‌పై జ‌‌‌‌రిగిన దాడిని ఖండించ‌‌‌‌క‌‌‌‌పోగా, దాడికి పాల్పడిన వారిని ప‌‌‌‌రామ‌‌‌‌ర్శించ‌‌‌‌డం ప్రజాస్వామ్యానికే అవ‌‌‌‌మాన‌‌‌‌క‌‌‌‌రంగా మారే ప్రమాదం ఉంది. ఈ దాడి ఒక‌‌‌‌రిద్దరు అధికారుల‌‌‌‌పై లేదా రెవెన్యూ శాఖాధికారుల‌‌‌‌పై జ‌‌‌‌రిగిన దాడిగా చూడవద్దు.   తెలంగాణ‌‌‌‌లోని యావ‌‌‌‌త్​ఉద్యోగ లోకంపై జ‌‌‌‌రిగిన దాడిగా భావిస్తున్నాం” అని చెప్పారు.