తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతరంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పర్యటించారు. స్థానిక ఎస్సీ కాలనీకి రాగానే ఆయనకు దళితుల నుంచి నిరసన సెగ తగిలింది. స్థానికులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. ఇళ్లు లేక తాము రోడ్లపై నివసిస్తున్నామని, ప్రభుత్వం ఇస్తామన్న డబుల్బెడ్రూం ఇళ్లు ఏవని ఎమ్మెల్యేను నిలదీశారు.
ఈ క్రమంలో నిరసనకారులకు ఎమ్మెల్యే అనుచరులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనుచరులు నిరసనలు తెలపకుండా దళితులను అడ్డుకుని తోసేశారు. ఈ పరిణామాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.