సెక్రటేరియెట్ చుట్టూ నిరసనలు నిషేధం: సీపీ ఆనంద్‌‌‌‌

  • బీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్ సెక్షన్‌‌‌‌ 163 అమలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర సెక్రటేరియెట్ చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. 500 మీటర్ల పరిధిలో బీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ 163(144 సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ) అమలు చేస్తున్నారు.ఈ మేరకు సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదుగురు కంటే ఎక్కువ గుమ్మికూడవద్దని ఆదేశించారు. నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ర్యాలీలపై నిషేధం విధించినట్లు తెలిపారు.

శాంతియుత ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఇందిరాపార్క్‌‌‌‌ ధర్నాచౌక్‌‌‌‌ వద్ద మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు. స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. సిటీ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలకు అనుమతులు లేవని తెలిపారు.