- అంబేద్కర్‌ను అవమానించారంటూ
- పార్లమెంట్, అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నేతల నిరసనలు
పార్లమెంట్ వేదికగా అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తీరును ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నాయి. అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని, పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గురువారం కూడా పార్లమెంట్ లోపలా బయట ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. దళితులంటే అమిత్‌షాకు చిన్నచూపని, అందుకే ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు.