తహసీల్దార్​ ఆఫీస్ లోకి దూసుకెళ్లిన బీజేపీ నేతలు.. ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ ఇవ్వట్లేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీసీ బంధు, గృహ లక్ష్మీ పథకానికి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 

ప్రభుత్వం మాత్రం కొందరికే స్కీం ల కింద లబ్ధి చేకూరుస్తోందని మిగతా వారికి అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో కార్యాలయ లోపలికి చొచ్చుకువెళ్లారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు.