శ్రీలంకలో 50 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు

కొలొంబో: శ్రీలంక ప్రెసిడెంట్​ గొటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు శనివారంతో 50 రోజులకు చేరాయి. ప్రెసిడెంట్​ పదవికి గొటబయ రాజీనామా చేయకుంటే ముందు ముందు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిర్వాహకులు హెచ్చరించారు. గత 49 రోజులుగా ప్రెసిడెంట్‌‌ కార్యాలయం ముందు జనం బైఠాయించి‘‘గోటా గో గామా”అంటూ గొటబయకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆందోళనకారులను  చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌‌ చేశారు.

రిఫరెన్స్‌‌ లైబ్రరీ, థియేటర్‌‌‌‌, రాజకీయ పోడియాల్లో నిరసనకారులు సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలతో ఆందోళన చేస్తున్నారు. రోజురోజుకూ ఈ ఆందోళనలకు ప్రజల మద్దతు పెరుగుతోంది. దీంతో ఆయా నిరసన ప్రదేశాల్లో ఫుడ్‌‌, వాటర్‌‌‌‌ను వలంటీర్లు సప్లయ్‌‌ చేస్తున్నారు. ‘‘రాజపక్స కుటుంబం మొత్తం పదవులు వదులుకొని, రాజకీయాలు విడిచిపెట్టినప్పుడే మా పోరాటం ముగుస్తుంది.

వారు చేసిన అన్ని తప్పులకు శిక్షగా రాజపక్స కుటుంబ సభ్యులను ప్రజాకోర్టు ముందుకు లాగుతాం”అని ఓ నిరసనకారుడు అన్నారు. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి కుప్పకూలడంతో ప్రధాని మహింద రాజపక్స ఇప్పటికే రాజీనామా చేశారు. దేశం దివాలా తీయడంతో పెట్రోల్‌‌, డీజిల్‌‌, ఫుడ్‌‌, మెడిసిన్స్‌‌, వంట గ్యాస్‌‌, టాయిలెట్‌‌ పేపర్‌‌‌‌, అగ్గిపుల్లలకు షార్టేజ్‌‌ కూడా ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.

ఇవి కూడా చదవండి

కోర్టు ఎదుట హాజరైన పాక్ మాజీ ప్రధాని

జీతాల్లేక కాంట్రాక్టు ఉద్యోగులు తిప్పలు

అసైన్డ్ భూములను గుంజుకున్నరు..ఉనికిచెర్లలో 118 ఎకరాలు తీసుకున్న ‘కుడా’

పార్టీలకతీతంగా రాజీనామాలకు సర్పంచులు రెడీ