- కాంగ్రెస్‌కు కేటాయించకపోతే రాజీనామా చేస్తాం
- కండ్లకు గంతలు కట్టుకొని నిరసన
కోల్‌బెల్ట్, వెలుగు: కాంగ్రెస్అధిష్ఠానం చెన్నూరు అసెంబ్లీ సీటును సీపీఐకి కేటాయించనున్నట్లు సమాచారం ఉండటంతో కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం రామకృష్ణాపూర్‌లోని రాజీవ్ చౌక్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట కండ్లకు గంతలు కట్టుకొని దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని, నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
పొత్తుల్లో భాగంగా చెన్నూరు సీటును సీపీఐకి కేటాయించడం సరికాదన్నారు. పార్టీ పునరాలోచించి కాంగ్రెస్‌కు కేటాయించాలని.. లేకపోతే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, పీసీసీ జనరల్ సెక్రటరీ రాఘునాథ్ రెడ్డి, డీసీసీ వైస్‌ప్రెసిడెంట్ పుల్లూరి లక్ష్మణ్, మందమర్రి మండల ప్రెసిడెంట్ నీలయ్య, లీడర్లు రవి, భూమేశ్, శ్రావణ్‌కుమార్, కొప్పర్తి నవీన్ తదితరులు పాల్గొన్నారు.