ఆర్మూర్ లో వార్డు సభల్లో ప్రొటోకాల్ రగడ

ఆర్మూర్ లో వార్డు సభల్లో ప్రొటోకాల్ రగడ
  •     ఎంపీ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టలేదని బీజేపీ నాయకుల ఆందోళన

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ లో మంగళవారం జరిగిన వార్డు సభల్లో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. సభలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఫొటోలు లేకపోవడంతో ప్రొటో కాల్ పాటించడం లేదని బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ యామాద్రి, చిన్నారెడ్డి అధికారులను నిలదీశారు. అనంతరం అధికారులు స్పందించి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో పాటు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఫొటోలను పెట్టి ఫ్లెక్సీలను తయారు చేయించారు.