ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలొద్దు : మంత్రి కొండా సురేఖ

మెదక్: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇవాళ మెదక్ జిల్లా చేగుంటలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి. షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కోసం అంతా కలిసి రావాలన్నారు. ఒక్కొ నియోజకవర్గానాఇకి 3500 ఇందిరమ్మ ర్గ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నా రు. 'ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతాం. ఈ విషయంలో ఎవరికి సందేహం వద్దు. ప్రజలే మాకు సుప్రీం.. వాళ్లకే మేము జవాబుదారులం.అని మంత్రి కొండా సురేఖ అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. 

ప్రోటోకాల్ రగడ..

మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. చెక్కుల పంపిణీ వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి రావడంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం నెలకొంది. ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

Also Read : ఏసీబీ విచారణకు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు