ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గద్వాల, వెలుగు: సమైక్యత వజ్రోత్సవాల్లో ప్రొటోకాల్ రగడ చోటుచేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌‌‌‌లో నిర్వహించిన  వేడుకల్లో తనను స్టేజీపైకి పిలవలేదని మున్సిపల్ చైర్మన్ బీఎస్‌‌‌‌ కేశవ్ అలిగి వెళ్లిపోబోయారు. గమనించిన ఆర్డీవో రాములు ఆయనకు నచ్చజెప్పి స్టేజీ దగ్గరికి తీసుకొచ్చారు.  అలాగే పరేడ్ గ్రౌండ్ ఉన్న మూడో వార్డు కౌన్సిలర్ గీత నాగుయాదవ్‌‌‌‌కు  కనీస సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆమె స్టేజీపైకి వచ్చి వాగ్వాదానికి దిగారు.  ఆగస్టు 15 , తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లోనూ ఆఫీసర్లు ఇలాగే వ్యవహరించారని ఆమె వాపోయారు. ఆఫీసర్లు ఇకమీద అలా జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. 

రజాకార్లను మించి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అరాచక పాలన
మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి
 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రజాకార్లను మించి అరాచక పాలన చేస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుంచి పార్టీ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించి..  జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో టీఆర్ఎస్, బీజేపీ ఎక్కడున్నాయని ప్రశ్నించారు.  కేవలం పొలిటికల్ ఇమేజ్ కోసం ఉత్సవాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో దేశం అప్పుల పాలైతే..  ఆదానీ, అంబానీల ఆస్తులు మాత్రం పెరిగాయని విమర్శించారు.  సీఎం కేసీఆర్ పీఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ఐ, కేఎల్‌‌‌‌ఐని పట్టించుకోవడం లేదని, కృష్ణా వాటా విషయంలో మరో ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు.

బయోడీజిల్​ కంపెనీకి కేఎస్పీ నీళ్లు వాడొద్దు

మరికల్​, వెలుగు : మరికల్​ మండలం చిత్తనూర్​ వద్ద ఏర్పాటు చేస్తున్న అగ్రో బయోడీజిల్​ కంపెనీ అవసరాలకు కోయిల్​సాగర్​ నీటిని వాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ మక్తల్​నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి ప్రశాంత్​ కుమార్​రెడ్డి హెచ్చరించారు. శనివారం మరికల్‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ కంపెనీ కేఎస్పీ ప్రధాన కాలువ పక్కనుంచే  రోడ్డుతో పాటు పైప్‌‌‌‌ లైన్ ​వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దీన్ని గ్రామ యువకులు అడ్డుకున్నా.. ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకున్నా పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు.  పనులు పూర్తయితే 21 గ్రామాలు పొల్యూట్ అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.  టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి జి.హర్షవర్దన్​రెడ్డి, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు గొల్ల కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ వీరన్న, నేతలు సత్యన్న,  మురళి పాల్గొన్నారు. 

పెరియార్‌‌‌‌‌‌‌‌ యాదిలో..

వనపర్తి టౌన్‌‌‌‌, జడ్చర్ల, మరికల్​, వెలుగు : కులం, మతం పేరుతో అసమానతలకు కారణమైన మనువాద వ్యవస్థపై పోరాటం చేసిన పెరియార్​ఈవీ రామస్వామిని  ఎస్సీ, బీసీ నేతలు గుర్తుచేసుకున్నారు. శనివారం పెరియార్ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.  జడ్చర్లలో బీసీసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్, వనపర్తిలో​ బీఎస్పీ జిల్లా ఇన్‌‌‌‌చార్జి గణపురం కృష్ణ, జిల్లా అధ్యక్షుడు నాగనమోని చెన్నరాములు, మరికల్‌‌‌‌లో బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి  బి.శ్రీనివాస్​ మాట్లాడుతూ ద్రావిడ ఉద్యమానికి పెరియార్ పితామహుడని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

సాయిచంద్‌‌‌‌తో భేదాభిప్రాయాలు లేవు
ఎమ్మెల్యే అబ్రహం

అలంపూర్, వెలుగు: గోడౌన్స్‌‌‌‌ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌‌‌‌తో తమకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఏమైనా ఉంటే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, మంత్రి కేటీఆర్ దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటామని ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల మధ్య అవగాహన లోపంతోనే శుక్రవారం శాంతినగర్‌‌‌‌‌‌‌‌లో తోపులాట జరిగిందన్నారు.  సాయిచంద్‌‌‌‌కు చెందిన కొందరు వ్యక్తులు 20 రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంతోనే కొందరు కార్యకర్తలు శుక్రవారం నాటి సభలో ఆగ్రహానికి గురయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి జడ్పీటీసీ రాజు, జోగులాంబ టెంపుల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఉండవెల్లి ఎంపీపీ బీసమ్మ, వైస్ ఎంపీపీ దేవన్న, మాజీ టెంపుల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ మండల అధ్యక్షుడు  రమణ పాల్గొన్నారు.

ప్రేమజంట ఆత్మహత్య

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్ జిల్లా తాడూరు మండలం తుమ్మలసుగూరులో శనివారం ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.  పోలీసుల వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన  గౌస్ (26),  గౌసియా (23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్లు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన గౌస్  శనివారం పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గౌసియా ఇంట్లో ఫ్యాన్‌‌‌‌కు ఉరేసుకుంది.  గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా, వరుసకు అన్నాచెల్లెలు కావడంతోనే పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించినట్లు తెలిసింది.

కళలకు ఆధ్యుడు విశ్వకర్మ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్​పర్సన్​ సునీత లక్ష్మారెడ్డి 

సకల కళలు, సృజనాత్మకతకు ఆద్యుడు, నాగరికతకు మూలపురుషుడు భగవాన్ విశ్వకర్మ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్​పర్సన్ ​సునీత లక్ష్మారెడ్డి  కొనియాడారు. శనివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా నారాయణపేట ఎస్పీ ఆఫీసులో జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ వనజ, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ హరిచందన, ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి  విశ్వకర్మ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.  వనపర్తిలో కలెక్టర్ యాస్మిన్ బాషా, అడిషనల్ కలెక్టర్  వేణుగోపాల్ , ఆమనగల్లులో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్​యాదవ్ విశ్వకర్మ జయంతిలో పాల్గొన్నారు.  తలకొండపల్లి మండలం వెల్జాల్‌‌‌‌ వీరబ్రహ్మేంద్ర స్వామి , లింగాల బ్రహ్మంగారి ఆలయంలో  విశ్వకర్మలు ప్రత్యేక పూజలు చేశారు.  
 –నారాయణపేట, వనపర్తి, వెలుగు