- జిల్లా హాస్పిటల్లో అడిషనల్ బెడ్స్ ప్రారంభంపై వివాదం
- హాస్పిటల్లో టెన్సన్ష్ వాతావరణం
కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో ప్రొటోకాల్రగడ రాజుకుంది. జిల్లా హాస్పిటల్బిల్డింగ్పై అంతస్తులో రూ. 4.53 కోట్లతో నిర్మించిన అడిషనల్ బెడ్స్ఉన్న వార్డును శనివారం ప్రారంభించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతోందని ప్రకటించారు.
మంత్రి ప్రోగ్రామ్‌కు హాజరుకాకపోవడంతో విశిష్ట అతిథిగా కార్యక్రమానికి వస్తున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ వార్డును ప్రారంభిస్తారని తెలుసుకొని శనివారం 11 గంటలకు ఎమ్మెల్యే హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ఛాంబర్లోకి వెళ్లి హాస్పిటల్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రొటోకాల్ విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్డాక్టర్రాంసింగ్, డీసీహెచ్‌వో విజయలక్ష్మిని ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీ, ట్రామాకేర్, శానిటేషన్‌కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. గతంలో ఉన్న శానిటేషన్ కాంట్రాక్టర్‌ను మార్చి మరొకరికి ఎలా కేటాయించారని ఆఫీసర్లను ప్రశ్నించారు. క్యాంటిన్, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణాలపై కూడా ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో గెలిచిన వారికి విలువ ఇవ్వకపోవడం సరికాదన్నారు.
ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, షబ్బీర్‌అలీ, రేవంత్‌రెడ్డిల్లో ఎవరో ఒకరు పోటీ చేయాలని సవాల్ విసిరారు. 2 గంటల వరకు ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు. మధ్యాహ్నం 2.30 కు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ హాస్పిటల్‌కు వచ్చారు. కలెక్టర్, ఇతర ఆఫీసర్లతో కలిసి అడిషనల్ వార్డును ప్రారంభించారు. జిల్లా హాస్సిటల్బయట, లోపల భారీ పోలీస్ బందోబస్త్ఏర్పాటు చేశారు.