ప్రైవేట్​కు దీటుగా విద్యను అందించండి : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన సదుపాయాలు కల్పించే బాధ్యత తనదని, ప్రైవేట్​కు దీటుగా టీచర్లు నాణ్యమైన విద్యను బోధించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్​తో కలిసి ఆయన హాజరయ్యారు.

ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అనంతరం ప్రభుత్వ స్కూల్​లో ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులను ఎమ్మెల్సే సత్కరించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాధవి దంపతులను ఆయా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు సన్మానించారు.