పేద ముదిరాజ్లకు న్యాయ సహాయం అందించండి: ఎమ్మెల్సీ బండ ప్రకాష్​

పేద ముదిరాజ్లకు న్యాయ సహాయం అందించండి: ఎమ్మెల్సీ బండ ప్రకాష్​

ఖైరతాబాద్, వెలుగు : ముదిరాజ్​సామాజిక వర్గానికి చెందిన పేద బిడ్డలకు న్యాయవాదులు న్యాయపరమైన సహాయం అందిస్తూ .. జాతి సంక్షేమానికి పాటు పడాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, ​ఎమ్మెల్సీ బండ ప్రకాష్​ కోరారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో తెలంగాణ ముదిరాజ్​అడ్వకేట్స్​అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది డాక్టర్​ ఆంజనేయులు అధ్యక్షతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. 

దీనికి బండ ప్రకాష్​తోపాటు డాక్టర్ ​చొప్పరి శంకర్​, సీతాఫల్​ మండి కార్పొరేటర్​ డాక్టర్ సామల హేమ, కుల్కచర్ల శ్రీనివాస్, న్యాయవాదులు డీఎల్​ పాండు, రామారావు, ప్రొఫెసర్​మల్లికార్జున్ పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న  శ్రీశైలం ముదిరాజ్​,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి శంకర్​ను సత్కరించారు.