విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ సి నారాయణరెడ్డి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ సి నారాయణరెడ్డి

షాద్ నగర్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్ సి నారాయణరెడ్డి కోరారు. మంగళవారం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులాల విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచి విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తోందన్నారు.