స్టూడెంట్స్​కు క్వాలిటీ ఫుడ్​ అందించాలి : పుడ్​ కమిషన్​చైర్మెన్  గోలి శ్రీనివాస్​ రెడ్డి

స్టూడెంట్స్​కు క్వాలిటీ ఫుడ్​ అందించాలి : పుడ్​ కమిషన్​చైర్మెన్  గోలి శ్రీనివాస్​ రెడ్డి

మక్తల్​,వెలుగు : స్టూడెంట్స్​కు నాణ్యమైన ఫుడ్​  అందించాలని,  లేకుంటే చర్యలు తప్పవని స్టేట్​ ఫుడ్​ కమిషన్​ చైర్మన్​ గోలీ  శ్రీనివాస్ ​రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన  నేతృత్వంలో ఫుడ్ కమిషన్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, రంగినేని శారద, ఎం భారతీ, బి జ్యోతి మక్తల్ మండలంలోని గుడిగండ్ల, జక్లేర్, మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. మక్తల్​ పట్టణంలోని మహత్మ జ్యోతిరావ్​ఫూలే గురుకుల స్కూల్​లో ఫంగస్​తో కూడిన సోరకాయలు ఉండటంతో అయన​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మీ ఇంట్లో  పిల్లలకు ఇలాంటి పుడ్​   పెడతారా’  అని  ప్రిన్సిపల్​ రేవతిపై మండిపడ్డారు.  ‘స్టూడెంట్లు అస్పత్రుల పాలవుతున్నా..  మీలో ఇప్పటికి మార్పురాదా’  అని ప్రశ్నించారు. అనంతరం  స్కూల్స్​లో విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. వంటగది,   బియ్యం,  నిత్యావసర సరుకులు  ఉప్పు, పప్పు, నూనె,  అల్లం, పసుపు  పరిశీలించారు.   మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులు తిని రుచి చూసిన తర్వాతే స్టూడెంట్​లకు వడ్డించాలని  ఆదేశించారు.

అనంతరం కమిషన్ బృందం జక్లేర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి,  భోజనాన్ని పరిశీలించారు.  పామ్ యిల్ కు బదులు బ్రాండ్ కలిగిన నూనె వాడాలని , అల్లం సరిగ్గా లేదని వెంటనే మార్చాలని చెప్పారు.    అనంతరం ఎల్లమ్మ కుంట లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో  గర్భిణులకు ఆహారాన్ని ఇంటికి పంపించవద్దని, తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలోనే  భోజనం చేసి వెళ్లేలా  జాగ్రత్తలు తీసుకోవాలని  టీచర్ కు సూచించారు.