ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కలెక్టర్‌‌‌‌కు లింగాపూర్, మేడిపల్లివాసుల విజ్ఞప్తి

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆర్జీ 1లోని మేడిపల్లి ఓపెన్‌‌ ‌‌కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌తో చాలా నష్టపోయామని, తమ ఇండ్లను తీసుకుని పునరావాసం కల్పించాలని లింగాపూర్‌‌‌‌, మేడిపల్లి గ్రామాల ప్రజలు కలెక్టర్ సంగీత, అడిషనల్ కలెక్టర్ కుమార్‌‌‌‌ దీపక్‌‌‌‌ను విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రభావిత గ్రామాల ఐక్య పోరాట సమితి(జేఏసీ) ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టరేట్‌‌‌‌కు వెళ్లి గోడును వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓసీపీ వల్ల ఇండ్లు బీటలువారాయని, వర్షాకాలంలో ఓబీ మట్టి ఇండ్ల వద్దకు చేరుకుంటుందన్నారు. పాములు, కొండ చిలువలు ఇండ్ల మధ్య తిరుగుతున్నాయన్నారు. స్పందించిన కలెక్టర్‌‌‌‌, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ సమస్యను ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లామని, అక్కడి నుంచి సూచనలు రాగానే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కాగా ఇదే అంశంపై రామగుండం ఎమ్మెల్యే చందర్‌‌‌‌ సోమవారం అడిషనల్ కలెక్టర్‌‌‌‌ లక్ష్మీనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ లీడర్లు ఎం.స్వామి, ఎం. శ్రీను, వి.రాజలింగం, పి.మహేశ్, కార్పొరేటర్లు శ్రీనివాస్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 

రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం

వేములవాడ, వెలుగు: ఇచ్చిన మాట ప్రకారం వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఆలయ అభివృద్ధిపై త్వరలో సీఎం కేసీఆర్​సమీక్ష నిర్వహిస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని సోమవారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయ విస్తరణ కోసం అన్ని పనులు చేస్తామన్నారు. రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నంతవరకు తమ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారన్నారు. సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ, టీఆర్ఎస్​జిల్లా అధ్యక్షుడు అగయ్య, లీడర్లు పాల్గొన్నారు. 

ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

గోదావరిఖని, వెలుగు: ఈనెల12న ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటన సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి కలెక్టర్ ఎస్.సంగీత అధికారులను ఆదేశించారు. సోమవారం రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి, అడిషనల్​కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డీసీపీ రూపేశ్ తో కలిసి ఎన్టీపీసీ స్టేడియంలోని హెలిప్యాడ్, సభ ఏర్పాట్లను, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ యూనిట్ ను పరిశీలించారు. అనంతరం ఎన్టీపీసీ జ్యోతి భవన్‌‌‌‌లో ఏర్పాట్లపై సమీక్షించారు. మీటింగ్‌‌‌‌లో తహసీల్దార్‌‌‌‌ జాహెద్‌‌‌‌ పాష, ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌, ఎన్టీపీసీ ఆఫీసర్లు పాల్గొన్నారు.

9న అంగారక టౌన్ షిప్ ప్రీ బిడ్ సమావేశం

కరీంనగర్ సిటీ, వెలుగు: నుస్తులాపూర్ గ్రామంలోని అంగారక టౌన్ షిప్ లో రెండో ప్రీ బిడ్ సమావేశం నవంబర్ 9న ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ కర్ణన్ సోమవారం ఓ  ప్రకటనలో పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో అంగారక టౌన్ షిప్ లో 656 ఓపెన్ ప్లాట్లను 14 నుంచి నవంబర్ 25 వరకు బహిరంగ వేలం వేస్తామన్నారు. నుస్తులాపూర్ రైతు వేదిక వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రీ బిడ్ ఉదయం 11.00 గంటలకు నిర్వహిస్తామని కలెక్టర్​ పేర్కొన్నారు.

స్కాలర్ ​షిప్ ​బకాయిలు విడుదల చేయండి

కలెక్టరేట్ ముందు స్టూడెంట్ల ధర్నా

కరీంనగర్ సిటీ, వెలుగు: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని స్టూడెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు మహేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగాన్ని విస్కరిస్తోందని అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ స్టూడెంట్లకు మెస్ చార్జీలు పెంచాలన్నారు. దీంతో స్పందించిన ఆర్డీఓ విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేశ్, జిల్లా ఆఫీస్ బేరర్స్ హేమంత్, వెంకటేష్, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు

ప్రజావాణిలో కలెక్టర్ రవి

జగిత్యాల, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జగిత్యాల కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. సోమవారం జగిత్యాల ఐఎంఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో 40  మందివివిధ సమస్యలపై దరఖాస్తులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ పెండింగ్ లో  ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అడిషనల్​కలెక్టర్లు లత, అరుణశ్రీ, అధికారులకు సూచించారు.

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 28 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ అనురాగ్​ జయంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్ లో ఉంచొద్దన్నారు. కాగా పెద్దూర్ ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అక్రమాల గురించి రేండేండ్ల నుంచి సమాచార చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే ఇన్​ఫర్మేషన్​ఇవ్వడంలేదని కలెక్టర్ కు దయానంద్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా జిల్లా సహకార అధికారి బుద్ధనాయుడును ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, ఇన్​చార్జి డీఆర్ఓ శ్రీనివాస్ రావు, వేములవాడ ఆర్డీఓ పవన్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

కరీంనగర్ సిటీ:  స్థానిక కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 202 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం చెల్ల బూత్కూర్​కు చెందిన డీకొండ పొచమ్మ వికలాంగుల పింఛన్​ఇప్పించాలని వినతిపత్రం అందించింది. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రియాంక, డీఎంహెచ్​ఓ జువేరియా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నతానియెల్, డీపీఓ వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. 

ధర్మపురి కోనేరుకు ‘కార్తీక శోభ’

కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని బ్రహ్మ పుష్కరిణి(కోనేరు)లో సోమవారం పంచ సహస్ర దీపాలంకరణ వైభవంగా నిర్వహించా రు. మంత్రోచ్ఛారణల మధ్య బ్రహ్మపుష్కరిణి మండ పంలోని ప్రత్యేక వేదికపై నరసింహస్వామి, లక్ష్మీదేవి చిత్ర పటాలకు ప్రత్యేక పూజలు చేశారు. జెడ్పీ చైర్ పర్సన్ వసంత జ్యోతి ప్రజ్వలన చేసి దీపాలంకరణ ప్రారంభించారు. భక్తులు కోనేరులోని ఉత్తర ద్వారం నుంచి వేదిక వరకు దీపాలు వెలిగించారు.  

- ధర్మపురి, వెలుగు

పగలు లైట్లు.. రాత్రి అంధకారం

విద్యుత్​ అధికారుల పర్యవేక్షణ లోపంతో కరీంనగర్ పట్టణం భాగ్యనగర్ లో ఐదు రోజులుగా పట్టపగలే వీధి లైట్లు వెలుగుతున్నాయి. సిబ్బంది లైట్లు ఆఫ్​చేయకపోవడంతో రాత్రీపగలూ తేడా లేకుండా వెలుగుతూ వందల యూనిట్లు కరెంట్​ వృథా అవుతోందని కాలనీవాసులు చెబుతున్నారు. అలాగే కరీంనగర్ ఎల్ఎండీ డ్యాంపై ఏర్పాటు చేసిన లైట్లు రాత్రయినా వెలగడం లేదు. దీంతో డ్యాంపై అంధకారం నెలకొంది. సాయంత్రం పూట డ్యాం చూడడానికి వస్తున్న సందర్శకులు కరెంట్​లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పోలీస్​సిబ్బంది చీకట్లోనే డ్యూటీ చేస్తున్నారు.

- వెలుగు ఫొటోగ్రాఫర్‍, కరీంనగర్

‘కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్’

సుల్తానాబాద్, వెలుగు: ఇంజనీరింగ్ స్టూడెంట్లు నాలుగేళ్లు కష్టపడి చదివితే 40 ఏళ్లు ఉద్యోగం చేసి ఉజ్వల భవిష్యత్​ను పొందవచ్చని నిగమ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ అంజిరెడ్డి అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలం సాంబయ్యపల్లిలో బీటెక్ ఫస్టీయర్ స్టూడెంట్లకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద శాతం ప్లేస్​మెంట్లతో తమ కాలేజీ ముందుంటుందని అన్నారు. సమావేశంలో డాక్టర్ రమణారెడ్డి, ప్రిన్సిపాల్ దేవయ్య, సంపత్, సురేష్ కుమార్ పాల్గొన్నారు.