యాసంగి పంటకు నీరివ్వండి.. మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డికి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు లెటర్‌‌‌‌‌‌‌‌

యాసంగి పంటకు నీరివ్వండి.. మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డికి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు లెటర్‌‌‌‌‌‌‌‌

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట నియోజకవర్గంలో యాసంగి పంటకు నీరిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌రావు కోరారు. ఇందుకోసం రంగనాయక సాగర్‌‌‌‌‌‌‌‌లోకి నీటిని పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేసి, కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేయాలన్నారు. ఈ మేరకు శుక్రవారం ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డికి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. నాలుగేండ్లుగా రంగనాయక సాగర్‌‌‌‌‌‌‌‌ కాల్వల ద్వారా పంటలకు నీరిస్తున్నామని లెటర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.

ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌ పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీటిని అందించాలని కోరారు. రంగనాయక సాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం 1.84 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని, యాసంగికి పూర్తిస్థాయిలో నీరు ఇవ్వాలంటే మరో 2.5 టీఎంసీలు అవసరమన్నారు. మిడ్‌‌‌‌‌‌‌‌ మానేరు నుంచి రెండు విడతలుగా రంగనాయక సాగర్‌‌‌‌‌‌‌‌లోకి నీళ్లు పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేసేలా ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను ఆదేశించాలని లెటర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.