మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం రాళ్లవాగుకు కరకట్టలు నిర్మించాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ డాక్టర్జి.వివేక్‌వెంకటస్వామితో కలిసి ఆయన ఎన్టీఆర్నగర్, రాంనగర్లో పర్యటించారు. కాళేశ్వరం బ్యాక్వాటర్రాళ్లవాగులోకి పోటెత్తడంతో మూడేండ్లుగా మంచిర్యాలలోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయని అన్నారు.
ఇండ్లు మునిగిపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పరిహారం అందించడం లేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. టౌన్ ప్రెసిడెంట్ వంగపల్లి వెంకటేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, అమిరిశెట్టి రాజు, బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్, అసెంబ్లీ కన్వీనర్ సంతోష్ పాల్గొన్నారు.
ముంపు రైతులను పట్టించుకోని బాల్క సుమన్
పంటలు ముంపునకు గురై నష్టపోయిన రైతులను చెన్నూర్ఎమ్మెల్యే బాల్క సుమన్పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్మండిపడ్డారు. చెన్నూర్ మండలం సుందరశాలలో దెబ్బతిన్న పంటలను వివేక్, రఘునాథ్‌తో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇప్పించాలన్నారు. ముంపు భూములకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని, రైతులకు మరో చోట భూములు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. చెన్నూర్ నియోజకవర్గ కన్వీనర్అక్కల రమేశ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, చెన్నూర్, భీమారం, జైపూర్ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.