మిర్యాలగూడ, వెలుగు : టీఎస్ యూటీఎఫ్ ఏర్పాటు చేసిన (ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్) తొమ్మిది నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 22 మందికి రూ.1.32 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశామని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ త్రిపురారం మండల కార్యదర్శి సామ సైదులు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. శనివారం పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ ఆఫీస్ లో సైదులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మృతుడి కుటుంబ సభ్యులకు ఎఫ్ డబ్ల్యూఎఫ్ నుంచి రూ.6 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగమణి, శ్రీనివాసాచారి, శ్రీనివాస్ రెడ్డి, చిన్నవెంకన్న, వేదశ్రీ, కాట్ల మధుసూదన్, పాల్వాయి శ్రీనివాస్ పాల్గొన్నారు.