పెండింగ్​ బిల్లులు వెంటనే ఇవ్వండి

పెండింగ్​ బిల్లులు వెంటనే ఇవ్వండి
  • సీఎంకు పీఆర్టీయూటీఎస్ నేతల విజ్ఞప్తి
     

హైదరాబాద్, వెలుగు: టీచర్లకు సంబంధించిన పెండింగ్​ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్​ రెడ్డిని ప్రోగ్రెసివ్​ రికగ్నైజ్డ్​టీచర్స్​ యూనియన్​ (పీఆర్టీయూ) అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్​ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్​ రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి కోరారు. పెండింగ్​లో ఉన్న ఐదు డీఏలతో పాటు రెండేండ్ల నుంచి పెండింగ్​లో పెట్టిన జీపీఎఫ్​, మెడికల్, సరెండర్​ లీవ్స్, రిటైర్మెంట్​ ప్రయోజనాలు, సప్లిమెంటరీ వేతనాలు, టీఎస్​జీఎల్ఐ బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిని కొత్తగా ఎన్నికైన యూనియన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీచర్ల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. టీచర్లకు ఏకీకృత సర్వీస్​ రూల్స్​ను అమలు చేయాలని, ప్రమోషన్లను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.