హెచ్ఎం పోస్టులను ప్రమోషన్లతో భర్తీ చేయండి.. విద్యాశాఖ సెక్రటరీకి పీఆర్టీయూ వినతి

హెచ్ఎం పోస్టులను ప్రమోషన్లతో భర్తీ చేయండి.. విద్యాశాఖ సెక్రటరీకి పీఆర్టీయూ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కార్​, పంచాయతీరాజ్ హైస్కూళ్లలో ఖాళీగా ఉన్న హెడ్మాస్టర్ పోస్టులను అడ్ హక్ పద్ధతిలో ప్రమోషన్లతో భర్తీ చేయాలని  పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, పి. దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. 

సోమవారం సెక్రటేరియెట్​లో కొత్తగా నియమితులైన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్​ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం విద్యారంగంలోని సమస్యలపై వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన శ్రీధర్..రెండు రోజుల్లో అధికారులతో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.