కుంటాల, వెలుగు: ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని కోరుతూ కుంటాల ప్రభుత్వ స్కూళ్లలోని ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు పెన్షన్విద్రోహ దినంగా పాటించారు. సీపీఎస్‌ను వెంటనే రద్దుచేయాలని తహసీల్దార్ఎజాజ్కు వినతిపత్రం అందజేశారు. మండల బాధ్యులు సతీశ్, నరేశ్, రాష్ట్ర నాయకులు గజేందర్, వెంకట్రావ్, తిరుపతి గౌడ్, గంగాధర్, సోమేశ్, భోజన్న, సాహెబ్రావు తదితరులు
పాల్గొన్నారు.
కలెక్టర్‌కు మెమోరాండం..
మంచిర్యాల: రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓసీపీఎస్ విధానాన్ని పునరుద్ధరణకు టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్తయ్య, ప్రధాన కార్యదర్శి రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్సంతోష్కు మెమోరాండం అందజేశారు. 2004 సెప్టెంబర్1 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పెన్షన్హక్కును కాలరాసేలా సీపీఎస్ విధానం ఉందని, దీని వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని అప్పటి వరకు పోరాటం ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూటీఎఫ్నాయకులు పాల్గొన్నారు.
జాక్టో ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం
నిర్మల్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ జాక్టో ఆధ్వర్యంలో నిర్మల్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అన్ని స్కూళ్ల టీచర్లు భోజన విరామ సమయంలో నిరసన తెలిపి, సాయంత్రం అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్‌కు మెమోరాండం సమర్పించారు. టీడబ్ల్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీవీ రావు, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గజేందర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.