- పీఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రెటరీ దామోదర్‌రెడ్డి
కామారెడ్డి, వెలుగు : టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీ పుల్గం దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన దామోదర్‌రెడ్డి పీఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎన్నకవడంతో అభినందన సభ, పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయ సభ ఆదివారం కామారెడ్డిలోని ఈఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ... టీచర్లకు సేవ చేసుకునేందుకు స్టేట్ బాధ్యతలు వచ్చాయన్నారు.
కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్‌గా 8 ఏండ్లు అవకాశం ఇచ్చారన్నారు. స్టేట్ జనరల్ సెక్రెటరీగా తనను గెలిపించేందుకు జిల్లాకు చెందిన సభ్యులంతా శ్రమించారన్నారు. అందరికీ తాను రుణపడి ఉంటానన్నారు. కరీంనగర్ నియోజక వర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి వంగ మోహన్‌రెడ్డి పోటీ చేస్తున్నారని ఆయన గెలుపు కోసం ప్రతి ఒకరు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... టీచర్ల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
తనను గెలిపిస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..యూనియన్ లీడర్‌గా, ఎమ్మెల్సీగా టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎంతగానో పని చేశానన్నారు. కొత్త కార్యవర్గ ప్రతినిధులు కష్టపడి పని చేయాలన్నారు. జిల్లా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు కుషాల్, శ్రీనివాస్‌రెడ్డి, స్టేట్, జిల్లా, మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.