విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ ప్రధానపాత్రల్లో మణిరత్నం రూపొందించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ చిత్రం సెకెండ్ పార్ట్ ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విజయేంద్ర ప్రసాద్, దిల్ రాజు మూవీ టీమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
విక్రమ్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకుల ఎనర్జీ అమేజింగ్. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా ప్రాంతాలకు వెళ్లాం. కానీ ఇక్కడ దొరికే ప్రేమ మరో లెవెల్‌లో ఉంటుంది. మణిరత్నం జీనియస్. ఆయనతో వంద సినిమాలైనా చేయాలనుకుంటాను’ అన్నాడు. ‘పీఎస్2’లో ప్రతి క్షణాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారంది ఐశ్వర్యరాయ్. ‘ఈ మూవీ మా అందరికీ గోల్డెన్ మూమెంట్స్ ఇచ్చింది. ఎన్నో విషయాలను నేర్చుకున్నాం’ అన్నాడు కార్తి. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారంది త్రిష.
జయం రవి మాట్లాడుతూ ‘మణిరత్నంకి గుండె ధైర్యం చాలా ఎక్కువ. రెండు పార్టులను ఒకేసారి తీసి ఆరు నెలల గ్యాప్‌లో రిలీజ్ చేయడం గొప్ప విషయం’ అన్నాడు. మణిరత్నం మాట్లాడుతూ ‘పొన్నియిన్ సెల్వన్..రెండు భాగాలుగా చేయటానికి కారణం రాజమౌళి. ఆయన ‘బాహుబలి’ చిత్రాన్ని రెండు భాగాల్లో తీయకపోయుంటే నేను కూడా దీన్ని రెండు భాగాల్లో తీయలేకపోయేవాడిని. అందుకే ఆయనకు థ్యాంక్స్’ అని చెప్పారు. ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.