ఐపీఎల్‌కు పోటీగా పాక్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం(ఫిబ్రవరి 17) డిఫెండింగ్ ఛాంపియన్ లాహోర్ ఖలాండర్స్, ఇస్లామాబాద్ యూనైటెడ్ మధ్య తొలి మ్యాచ్ జరగ్గా.. యూనైటెడ్ జట్టు సంచలన విజయం సాధించింది. ఈ గెలుపే టోర్నీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఖలాండర్స్ నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని.. ఇస్లామాబాద్ అలవోకగా ఛేదించడంతో ఈ టోర్నీ ఫిక్సింగ్ అంటూ మాటలు వినపడుతున్నాయి.
ఫఖర్ జమాన్, సాహిబ్జాదా ఫర్హాన్, వాన్ డెర్ డస్సెన్, అబ్దుల్లా షఫీక్, డేవిడ్ వీస్, లోర్కాన్ టక్కర్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్.. ఇది లాహోర్ జట్టు. 10 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు సహా గంటకు 150 కి.మీ. వేగంతో బంతులేసే ముగ్గురు పేసర్లు. అయినప్పటికీ.. దాదాపు 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. పోనీ, ప్రత్యర్థి జట్టు అంత బలంగా ఉందా..! అంటే అదీ లేదు. ఏడాది కాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న అల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(74; 41 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఖలాండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. వాన్ డెర్ డస్సెన్(71; 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు), సాహిబ్జాదా ఫర్హాన్(57; 36 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం ఆ లక్ష్యాన్ని ఇస్లామాబాద్ మరో 10 బంతులు మిగిలివుండగానే చేధించింది. షాదాబ్ ఖాన్(74 నాటౌట్; 41 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), అఘా సల్మాన్(64 నాటౌట్; 31 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)ల జోడి వీరవిహారం చేసింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
పీఎస్‌ఎల్ బ్యాన్ చేయాలి
టోర్నీ తొలి మ్యాచ్‌లోనే వ్యతిరేక ఫలితం రావడంతో పాక్ క్రికెట్ అభిమానులు భగ్గుమంటున్నారు. పీఎస్‌ఎల్ టోర్నీపై ఫిక్సింగ్ నీడలు కమ్ముకున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. టోర్నీని నిషేధించాలని గళమెత్తుతున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఆదాయం కోసం పాక్ క్రికెట్ బోర్డు తప్పుదారి పడుతున్నట్లు విమర్శిస్తున్నారు. మున్ముందు ఇలాంటి సంచలన ఫలితాలు మరెన్ని చూడాలంటూ మరికొందరు చెప్తున్నారు.
Captain Shahdab Khan was in mood 🔥#PSL2024 #PSL9 #HBLPSL #HBLPSL2024 #LQvsIU #LQvIUpic.twitter.com/R3ELWsKH5Y
— King Babar Azam Army (@kingbabararmy) February 17, 2024