
యుక్త వయసులో ఉన్నప్పుడు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఉడుకు రక్తం కదా...! ఏది చేసిన కరెక్టే అన్న భ్రమలో ఉంటారు. ఇలానే ఓ పాక్ క్రికెటర్ వికెట్లను కాలితో తన్నుతూ అత్యుత్సాహం చూపాడు. పోనీ, అతనలా చేయదగ్గ సందర్భ సంధర్భమా..! అంటే అదీ కాదు. కావాలనే తన్నాడు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు.
ఏం జరిగిందంటే..?
పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా ఆదివారం ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముల్తాన్ తొలుత బ్యాటింగ్ చేయగా.. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాదాబ్ ఖాన్ నసీం షాకు అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయని షా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ఓవర్ పూర్తి కాగానే షా కాలితో స్టంప్స్‌ను తన్నుతూ ఓవర్ యాక్షన్ చేశాడు. ఈ ఘటనపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయగా.. రోషన్ మహానామా అతనిపై చర్యలు తీసుకున్నాడు.
Naseem Shah was fined for kicking the stumps after a PSL match#IUvsMS #HBLPSL9 pic.twitter.com/E4etTPGxYN
— U.M.A.I.R (@Umair20476083) March 11, 2024
నిబంధనలు ఉల్లంఘన
"క్రికెట్ సామాగ్రి లేదా గ్రౌండ్ పరికరాల దుర్వినియోగానికి సంబంధించి ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కింద నసీమ్‌పై అభియోగాలు మోపారు. నేరాన్ని నసీమ్ అంగీకరించినట్లు తెలిపిన మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా.. మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.