PSL 2024: క్రికెట్ అభిమానులకు పండగే.. ఫిబ్రవరి 17 నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్

PSL 2024: క్రికెట్ అభిమానులకు పండగే.. ఫిబ్రవరి 17 నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఆ దేశ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్‌కు పోటీగా నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 17న ప్రారంభమై.. మార్చి 18న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. 

మొత్తం నాలుగు వేదికలు లాహోర్, కరాచీ, ముల్తాన్, రావల్పిండి స్టేడియాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా.. కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియం ప్లే-ఆఫ్స్, ఫైనల్‌ పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ లాహోర్ ఖలాండర్స్‌తో షాదాబ్ ఖాన్ నేతృత్వంలోని ఇస్లామాబాద్ యునైటెడ్‌ తలపడనుంది.