ఐపీఎల్‌కు పోటీగా పాక్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ ఎల్) షురూ అయ్యింది. శనివారం(ఫిబ్రవరి 17) లాహోర్ వేదికగా ఈ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ లాహోర్ ఖలాండర్స్, ఇస్లామాబాద్ యూనైటెడ్ మధ్య తొలి మ్యాచ్ జరగ్గా.. యూనైటెడ్ జట్టు సంచలన విజయం సాధించింది. భారత్‌లో ఈ మ్యాచ్‌లను టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చూసే అవకాశం లేకపోవడంతో అభిమానులు ఎలా చూడాలని నెట్టింట శోధిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
6 జట్లు.. 34 మ్యాచ్‌లు
ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 వరకూ జరగబోయే ఈ టోర్నీలో మొత్తం 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో 30 లీగ్ మ్యాచ్‌లు కాగా, మిగిలిన 4.. ప్లేఆఫ్స్ (క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఎలమినేటర్ 2, ఫైనల్)మ్యాచ్‌లు. ఈ మ్యాచ్‌లన్నీ నాలుగు (లాహోర్, కరాచీ, ముల్తాన్, రావల్పిం) వేదికల్లో జరగనున్నాయి. లీగ్ మ్యాచ్ లకు లాహోర్, ముల్తాన్, రావల్పిండి ఆతిథ్యమివ్వనుండగా.. నాకౌట్ మ్యాచ్‌లకు కరాచీలోని నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో ప్రతి జట్టు మిగిలిన ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది.
జట్లు - కెప్టెన్లు
- ముల్తాన్ సుల్తాన్స్: మహ్మద్ రిజ్వాన్
- కరాచీ కింగ్స్: షాన్ మసూద్
- లాహోర్ ఖలాండర్స్: షాహీన్ షా అఫ్రిది
- ఇస్లామాబాద్ యునైటెడ్: షాదాబ్ ఖాన్
- పెషావర్ జల్మీ: బాబర్ ఆజమ్
- క్వెట్టా గ్లాడియేటర్స్: రిలీ రూసో
టీవీల్లో రావు..
పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లను భారత్‌లో టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూసే అవకాశం లేదు. ఫ్యాన్‌కోడ్ (Fancode) యాప్ ద్వారా ఈ మ్యాచ్‌లను వీక్షించొచ్చు. అలాగే, ఫ్యాన్‌కోడ్ వెబ్‌సైట్స్‌లోనూ ప్రత్యక్ష ప్రసారాలు చూడొచ్చు. అయితే ఇది ఫ్రీ కాదు. ఒక్క మ్యాచ్ చూడాలంటే రూ.25 చెల్లించాలి. అదే మొత్తం మ్యాచ్‌లు చూడాలనుకుంటే రూ. 149 చెల్లించాలి. గూగుల్ ప్లే స్టోర్‌లో ఫ్యాన్‌కోడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
The long-awaited #HBLPSL9 schedule 🏏 is FINALLY here! 🕺🎉
— PakistanSuperLeague (@thePSLt20) January 12, 2024
Read more ⬇️https://t.co/VYyPnjSjLL pic.twitter.com/HbrtArZp7G