పాక్ వేదికగా జరుగుతోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ లో వింత ఘటన చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ విదేశీ ఆటగాడు, న్యూజిలాండ్ క్రికెటర్ కోలిన్ మున్రో.. బాల్ బాయ్‌తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇందులో వింతేముంది అనుకోకండి..! అందులోనే దాగుంది అసలు మ్యాటర్.
అసలేం జరిగిందంటే..?
సోమవారం(మార్చి 4) ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో జల్మీ పవర్ ప్లే ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 18 పరుగులు చేసింది.
ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన అమీర్ జమాల్.. ఫహీమ్ అష్రఫ్ వేసిన ఏడో ఓవర్ ఆఖరి బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్ గా మలిచాడు. ఆ సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోలిన్ మున్రో మీదుగా బంతి వెళ్ళింది. అతనికి క్యాచ్ పట్టే అవకాశం లేకపోవడంతో.. బౌండరీ లైన్ వెలుపల ఉన్న బాల్ బాయ్ అందరూ ఆశ్చర్యపోయేలా డైవింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ సంబరాలు చేసుకున్నారు. బాల్ బాయ్ ఎఫ్ర్ట్స్ ని మెచ్చుకుంటూ మన్రో అతడిని ప్రశంసించాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ALSO READ :- అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే కెప్టెన్సీ వదిలేస్తా: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్ వెటకారం
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే, ఛేదనలో పెషావర్ జల్మీ 167 పరుగులకే పరిమితమైంది. పలితంగా 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Wholesome😍#PSL2024 #ColinMunro #CricketTwitter pic.twitter.com/ttty4JcxqP
— Cricbuzz (@cricbuzz) March 5, 2024