PSLV C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా -3 ఉపగ్రహంలో టెక్నికల్ సమస్య ఉన్నట్లు గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు వెంటనే కౌంట్ డౌన్ ను నిలిపివేశారు. రేపు(గురువారం డిసెంబర్ 5న ) రాకెట్ ప్రయోగించే అవకాశం ఉంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో) బుధవారం ఏపీలోని శ్రీహరి కోట నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV)-C59 ప్రయోగానికి సిద్దమైంది. దాదాపు 550 కిలోల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోని దీర్ఘవృత్తాకారం కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
అయితే ఈPSLV)-C59 రాకెట్ మోసుకెళ్లే ప్రోబా -3 ఉపగ్రహంలో టెక్నికల్ సమస్య ఉండటంతో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేశారు. ప్రోబా-3 శాటిలైట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ఇన్-ఆర్బిట్ ప్రదర్శన (IOD) మిషన్.