104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C3 ఎగువ దశలో అట్లాంటిక్ మహా సముద్రంపై సురక్షితంగా కూలిపోయింది. 2024 అక్టోబర్ 6న ఇస్రో ప్రయోగించిన PSLV C3 రాకెట్ చివర దశ శకలాలు భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించడం ద్వారా దాదాపు ఎనిమిదేళ్ల అంతరిక్ష ప్రయాణికి ముగింపు పలికింది.
2027, ఫిబ్రవరి 15న PSLV C3ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించింది. ఒకే మిషన్ లో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించింది. ప్రథమిక పేలోడ్ కార్డోశాట్ 2D తోపాటు 103ఉపగ్రహాలను అంతరిక్షంలోకి సురక్షితంగా ఇంజెక్ట్ చేసింది. ఇందులో భారత్ కుచెందిన నానో ఉపగ్రహాలు, వివిధ దేశాలకు చెందిన చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి.
అన్ని శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత రాకెట్ ఎగువ దశ (PS4) 470x494 కిమీ కక్ష్యలో వదిలివేయబడింది. క్రమంగా వాతావరణ డ్రాగ్ కారణంగా భూమివైపు చేరుకుంది. ఆ ప్రక్రియ అంతా ఇస్రో, దాని IS4OM( ISRO సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్ మెంట్) సౌకర్యం ద్వారా నిశితంగా పరిశీలించబడింది.
యూఎస్ స్పేస్ కమాండ్, IS4OM రెండూ ఊహించినట్లుగానే PSLV C3 శకలాలు అక్టోబర్ 6, 2024న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంపై పడ్డాయి. అంతరిక్ష శిథిలా నివారణకు భారత్ నిబద్ధతతను ఈ ఈవెంట్ హైలైట్ చేస్తుంది.