ఇస్రో ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్

ఇస్రో ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. తెల్లవారు జామున 4 గంటల 29 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. శ్రీహరి కోటలోని షార్ నుంచి సోమవారం ఉదయం 5 గంటల 59 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది PSLV- C52 రాకెట్. రాకెట్ ప్రయోగానికి ఇస్రో లాంచ్ ఆథరైజేషన్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్పేస్ లోకి వెళలేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిరంతరాయంగా 25 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ తర్వాత స్పేస్ లోకి దూసుకెళ్లనుంది పీఎస్ ఎల్వీ రాకెట్. 17 వందల 10 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఐఆర్ శాట్-1 ఏ, ఐఎన్ ఎస్- 2టీడీతో పాటు విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్ స్పైడర్ శాట్-1 ఉపగ్రహాలను పీఎస్ ఎల్వీ మోసుకెళ్లనుంది. ఇస్రో ఛైర్మన్ గా సోమనాథ్ బాధ్యతలు చేపట్టాక తొలి ప్రయోగం ఇదే.

మరిన్ని వార్తల కోసం..

 

ఎస్టీ కమిషన్ ఇంకెప్పుడు ?

మార్చురీలను మోడర్నైజ్​ చేస్తం