హైదరాబాద్లో సైకో వీరంగం.. కనిపించిన వారిపై కత్తితో దాడి.. సైకోను తాళ్లతో బిగించి..

హైదరాబాద్లో సైకో వీరంగం.. కనిపించిన వారిపై కత్తితో దాడి.. సైకోను తాళ్లతో బిగించి..

హైదరాబాద్ లో సైకో వీరంగం సృష్టించాడు. రోడ్డుకు అడ్డంగా వచ్చి కనిపించిన వారిపై కత్తితో దాడి చేసి భయానక వాతావరణాన్ని సృష్టించాడు. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. అడ్డుకోవడానికి ఎవరు వచ్చినా, ఆపడానికి ప్రయత్నించినా వినకుండా కత్తితో దాడికి దిగాడు. దీంతో ఒక్కసారిగా వాతావరణం భయానకంగా మారిపోయింది.

ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్  పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోచారంలో సూర్య హాస్పిటల్ ఎదురుగా రోడ్డుపైకి వచ్చిన సైకో వీరంగం సృష్టించాడు. పలు కార్లను ధ్వంసం చేశాడు. రోడ్డుపై నిలబడి ఎవరు వస్తే వారిపై కత్తితో దాడి  చేశాడు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. 

ALSO READ | గంజాయి స్మగ్లింగ్లో మహిళలు.. హైదరాబాద్లో గంజాయి కట్టలతో పట్టుబడ్డారు.. ఎంత దొరికిందంటే..

ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో చుట్టుపక్కల జనాలు సైకోను చితకబాది అదుపులోకి తీసుకొచ్చారు. జనాలు తలో చేయి వేయడంతో స్పృహ కోల్పోయాడు సైకో. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోచారం సీఐ రాజు వర్మ ఘటనపై వివరాలు సేకరించారు. ఆ తర్వాత సైకోను తాళ్లతో బంధించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.